30 July, 2026 | 6:43 PM

ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి

30-07-2026 05:38 PM

- గిరిజన విద్యార్థి సంఘం

బోధన్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు రెండు నెలలు గడిచినా యూనిఫాంలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జాదవ్ ప్రవీణ్ నాయక్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ హాస్టళ్లలో మంచాలు, బెడ్‌షీట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, దోమతెరలు, పరిశుభ్రత వంటి కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే నాణ్యమైన పోషకాహారం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేయడంతో పాటు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో అవసరమైన మౌలిక వసతులు, పోషకాహారం, పరిశుభ్రత, భద్రత కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.