calender_icon.png 8 January, 2026 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

04-01-2026 12:00:00 AM

ఇది హార్థిక్ మార్క్ విధ్వంసం

భారత క్రికెట్ లో హార్థిక్ పాండ్యా హిట్టింగ్‌కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. క్లిష్టమైన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి భారీ షాట్లతో బాదడంలో హార్థిక్ స్టైలే వేరు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసం సృష్టించాడు. మ్యాచ్ 38వ ఓవర్ సమయానికి 62 బంతుల్లో 66 పరుగులు చేశాడు. 39వ ఓవర్ ముగిసేసరికి 100 పరుగులు బాదేశాడు. 

ప్రజాస్వామిక పోరాట యోధురాలు ఖలీదా

ఖలీదా జియాకు కేవలం బంగ్లాదేశ్‌తోనే కాకుండా అవిభాజ్య భారత్‌తోనూ విడదీయలేని అనుబంధం ఉంది. భర్త మరణంతో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనతి కాలంలోనే దేశ ప్రధాని అయ్యారు.  బంగ్లాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు రాజీలేని పోరాటాలు చేశారు. ఆమె అస్తమయం  ప్రపంచ ప్రజాస్వామ్యవాదులను కలచివేసిందన్నది.