04-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి3 (విజయక్రాంతి): రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ పొగమంచు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో శనివారం అత్యల్పంగా 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నారు.