26 April, 2026 | 1:26 AM

ఈ వారం వార్తల్లో..

26-04-2026 12:00 AM

నెలరోజుల సీఎం నాదెండ్ల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు ఇటీవల కన్నుమూశారు. 1983లో టీడీపీ స్థాపనలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహితుడిగా, వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. 1984లో ఆయన అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. కేవలం 31 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. అత్యల్ప కాలం సీఎంగా పనిచేసిన నేతగా నిలిచారు.

దక్కనీ స్టార్ బబ్బన్

హైదరాబాద్ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన రంగస్థల కళాకారుడు బబ్బన్ ఖాన్ (83) ఇటీవల కాలంచేశారు. ‘అద్రక్ కే పంజే’ అనే ఏకపాత్రాభినయం ద్వారా ఆయన అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఈ నాటకానికి ఆయనే సృష్టికర్త. ప్రధాన పాత్రలో కూడా ఆయనే నటించి మెప్పించేవారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రదర్శించిన వన్-మ్యాన్ షోగా నాటకం గిన్నిస్ రికార్డు సాధించడం విశేషం.