26 April, 2026 | 1:26 AM

దేవునిగుట్ట.. మహా -బౌద్ధదిట్ట!

26-04-2026 12:00 AM

ములుగు జిల్లా కొత్తూరు బయట ఉన్న దేవునిగుట్ట మీద దేవాలయానికి ఉత్తరంవైపు గోడమీద చెక్కిన కథాదృశ్యం కొత్తదిగా ఉంది. భయంకరంగా ఉన్న పెద్దతల కలిగిన బోధిసత్వుడు(జంభాలుడు?) ఎడమమోకాలితో ఎవరివీపునో వంచి, ఎడమ చేత అతని గొంతును వెనక్కి విరిచి నొక్కుతున్నట్టుగా ఉంది. బోధిసత్వుని అవతారాల్లో జంభాలుడు మహాబలవంతుడు. సాధన మాలలో చెప్పినట్టు ‘ఉచ్చుస్మ జంభాలుడు’ ధనదుణ్ణి తొక్కిపట్టి నోటి నుంచి వజ్రాలు కక్కిస్తాడు.

ఇక్కడ తనను గుర్తుచేసుకోవచ్చు. బౌద్ధ ప్రతిమాలక్షణాలను పరిశీలిస్తే జంభాలుని గురించి తెలుస్తుంది. ఈ శిల్పంలో ధనదు(రాక్షసు)ని వధిస్తున్న తీరు పట్టడకల్‌లో మహిషాసురమర్దని మహిషుణ్ణి వెన్నువిరిచి చంపుతున్న శిల్పంతో పూర్తిగా పోలి ఉంది. ఈ గుడిమీద బాదామీ శిల్పశైలి ప్రభావం కనిపిస్తుంది.

శ్రీరామోజు హరగోపాల్,

కన్వీనర్, కొత్త తెలంగాణ

చరిత్రబృందం

99494 98698