14 June, 2026 | 1:42 AM

ఈ వారం వార్తల్లో..

14-06-2026 12:00 AM

వెండితెరపై భారతీరాజ్

భారతీరాజా.. కథను కథలా కాకుండా కెమెరాతో కథ చెప్పడం ఈ దర్శకుడి విలక్షణ శైలి. అది పాటైనా, సన్నివేశమైనా వాటిపై ఆయన మార్క్ కచ్చితంగా ఉండాల్సిందే. కణ్ణన్ అనే సినిమాటో గ్రాఫర్‌తో ఆయన తీసిన ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’ ఎవర్‌గ్రీన్. అందుకే.. భారతీయ సినీ చరిత్రలో భారతీరాజా ఒక బెంచ్‌మార్క్. ఆయన కాలం చేసినప్పటికీ, తన సినిమాలు మాత్రం అజరామరం.

మస్క్ మావా మాజాకా!

ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అతి పెద్ద ఫీట్ సాధించారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. తన సంపద ఇప్పుడు ఏకంగా సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు. అంటే.. భారత కరెన్సీలో రూ.౧౦౦ లక్షల కోట్లకు పైమాటే అన్నమాట. ఆ సంపద ఎంతో ఊహించాలంటే, ఆ కరెన్సీ నోట్లతో ఒక సరళరేఖ గీస్తే భూమి, సూర్యుడి మధ్య ఉన్న సుమారు 150 మిలియన్ కిలోమీటర్ల దూరాన్నీ అధిగమించగలదు.