ఈ వారం వార్తల్లో..
హసీనా.. జీనా కహా!
తాను ఢాకాలోని న్యాయస్థానం ఎదుట లొంగిపోవాలని అనుకున్నాని, కానీ.. ప్రాణాలకు ముప్పు ఉందని ఆగిపోయానని బంగ్లా మాజీ ప్రధాని, షేక్ హసీనా తాజాగా మీడియా ఎదుట వాపోయారు. 2024లో ఆ దేశంలో జరిగిన విద్యార్థుల తిరుగుబాటు కారణంగా అక్కడి నుంచి భారత్‌కు వచ్చారు. మనసులో స్వదేశానికి వెళ్లాలని ఉన్నప్పటికీ, భారత్‌లోనే ఆశ్రయం పొందాల్సిన అనివార్యతపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు.
నెవ్వర్ బిఫోర్ నోలన్!
క్రిస్టోఫర్ నోలన్.. సినీ ప్రేమికులకు ఈ పేరు సుపరిచతమే. ‘మెమెంటో’, ‘ది ప్రెస్టీజ్’, ‘ఇన్సెప్షెన్’ నుంచి నిన్నమొన్నటి ‘టెనెట్’, ‘ఓపెన్ హైమర్ ’ వరకు ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలే. నోలన్ తాజాగా క్రేజీ ప్రాజెక్ట్ ‘ఒడిస్సీ’. హోమర్ రాసిన ఈ ఇతిహాసం పాశ్చాత్య సాహిత్యానికి ఒక మహాభారతం. ఈ చిత్రం నెల ౧౭న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. సినీ ప్రేమికులు నెల రోజుల ముందే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.






