ఈ వారం వార్తల్లో..
ఉద్యమ కెరటం నేహా
ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ఇప్పుడు ఇండియాలో ఫేమస్. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఉద్యమంలో కీలక నేతగా నాయకత్వం వహించారు. నీట్ అక్రమాలపై సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి దీక్ష చేపట్టారు. జేఎన్‌యూలో పీహెచ్‌డీ చేస్తూ.. విద్యారంగం ప్రైవేటీకరణ, నిరుద్యోగితపై ప్రభుత్వాలను నిలదీస్తూ, నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
జెన్‌జీని మెచ్చిన భగవత్
జెన్‌జీ, జెన్ ఆల్ఫా తరానికి తాను గుడ్డిగా మద్దతు ఇస్తానని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత తరాల కంటే నేటి యువత నిజాయతీగా ఉందన్నారు. వారిలో దేశభక్తి, సేవాభావం పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. సమస్యలపై నిరసన తెలపడం దేశద్రోహం కాదన్నారు. యువత ఆవేదనను గుర్తించి మద్దతుగా నిలిచిన ఆయనపై దేశవ్యా ప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.






