calender_icon.png 17 July, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగదీశ్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

16-07-2025 01:19:12 AM

బీఆర్‌ఎస్ సీనియర్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇది హేయమైన చర్య అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో ముఖ్య మంత్రి స్థాయికి వచ్చినంకా కూడా ఈ మాటలు మాట్లాడటం తగదన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో మూడు జిల్లా లు, మూడు మెడికల్ కాలేజీలు, తుంగతుర్తికి గోదావరి నీళ్లు తెచ్చారని చెప్పారు. రేవంత్‌రెడ్డి 1983 నుంచి తనకు తెలుసునని,

ఆయన ఊరు కొండారెడ్డిపల్లికి కూడా వెళ్లాలనని, రేవంత్‌రెడ్డి కు టుంబం తెలుసునని, ఆయన చరిత్ర, ఆస్తులు తెలుసునని చెప్పారు. రేవంత్‌కంటే జగదీశ్వర్‌రెడ్డి గారిది పెద్ద ఫ్యామిలీ అని, రేవంత్‌కంటే కూడా ఎక్కువగా ఆస్తులు ఉన్నాయని చెప్పారు. రేవంత్‌రెడ్డి లాగా గోడల మీద రాతలు రాసి, గోడలు దూకి రాలేదని చెప్పారు.