16-07-2025 01:18:54 AM
విద్యార్థులకు మంత్రి శ్రీధర్‌బాబు దిశానిర్దేశం
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ‘ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంతో పాటు మనం కూడా మారాలి. కాలం చెల్లిన జ్ఞానా న్ని విడిచిపెట్టి, నిరంతరం నూతన విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే సక్సెస్ మనల్ని వరిస్తుంది’ అని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన “మన అమెరికా తెలుగు సంఘం(మాట)- టాస్క్ ఫ్రీ ఆన్‌లైన్ ఐటీ ట్రైనింగ్” సర్టిఫికెట్ల ప్రధానోత్సవంలో మంత్రి మాట్లాడారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో కనీస అవగాహన ఉండటం లేదని తేల్చిందని గుర్తు చేశారు. 2025 నాటికి 8.5 కోట్ల ఉద్యోగాలు రోబోలు, ఏఐ వల్ల పోతే.. కొత్తగా 9.7 కోట్లు పుట్టుకొస్తాయని వరల్డ్ ఎకానమిక్ ఫోరం చెప్పిందన్నారు.
చేతిలో డిగ్రీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై పట్టు ఉంటేనే కొత్త ఉద్యోగాలను సాధించలేరని, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, టీం వర్క్, అడాప్టబిలిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లాంటి స్కిల్స్ కూడా అవసరమని, ఆ దిశగా విద్యార్థి దశ నుంచే కృషి చేయాలని ఆయన సూచించారు. లక్ష్యం అంటూలే ని జీవితం చిరునామా లేని లెటర్ లాంటిదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్మార్ట్‌వర్క్‌తో కూడిన హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుందని వివరించారు. సంప్రదాయబద్ధంగా కాకుం డా వినూత్నంగా ఆలోచించాలన్నారు.
స్కిల్ కేపిటల్ గ్లోబ్‌గా తెలంగాణ
స్కిల్ కేపిటల్ ఆఫ్ గ్లోబ్‌గా తెలంగాణను మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. నైపు ణ్యాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. యంగ్ ఇండి యా స్కిల్స్ యూనివర్సిటీ, టాస్క్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమా జం కోసం కూడా ఆలోచించాలన్నారు. ‘మాట’ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. కార్యక్రమంలో టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, మాట ప్రతినిధులు శ్రీనివాస్, ప్రదీప్, విజయ్ భాస్కర్, నగేశ్, కల్యాణి, డా.విజయ్‌భాస్కర్ పాల్గొన్నారు.