16 May, 2026 | 2:11 AM

సంగారెడ్డిలో టీజీఐఐసీ కార్యాలయం ప్రారంభోత్సవం

16-05-2026 12:00 AM

హాజరైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి, మే 15(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలోని ఆదర్శ్ నగర్ లో టీజీఐఐసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కార్యాలయంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డిని నూతన కార్యాలయంలోని కుర్చీలో కూర్చోబెట్టారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, సెట్విన్ ఛైర్మన్ గిరిధర్ రెడ్డి, టీజీఐఐసీ అధికారులు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డికి అభినందనలు తెలిపారు.