దస్తగిరి ఆశ్రమంలో రాజగోపురం ప్రారంభం
దాత సహకారంతో నిర్మాణం
ఆశీర్వదించిన పీఠాధిపతులు
జహీరాబాద్, జూలై 5: శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ రాజ గోపురాన్ని అంగరంగ వైభోగంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. ఆదివారం నాడు వేదమంత్రాలతో ఆలయ పీఠాధిపతి వైరాగ్య శిఖామని శ్రీ అవధూత గిరి మహారాజ్, డాక్టర్ సిద్ధిష్వరానందగిరి మహారాజ్ కరకమలములచే ప్రారంభోత్సవం నిర్వహించారు.
రాజగోపురానికి హైదరాబాద్ నిజాంపేటకు చెందిన సునీత భద్రారెడ్డిల విరాళంతో నిర్మించారు. భద్రారెడ్డి దత్తగిరి మహారాజ్ ఆశ్రమానికి కాకుండా వివిధ ప్రాంతాలలో సనాతన ధర్మం కోసం పురాతన ఆలయాలను పరిరక్షించేందుకు నూతన ఆలయాలను నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తున్నాడని అవధూత గిరి మహారాజ్ కొనియాడారు.
ఆదివారం ఉదయం వేదమంత్రాలతో రాజగోపురంపై ఐదు కలశాలను ప్రతిష్టించారు. భద్రారెడ్డి ఆలయ అభివృద్ధికే కాకుండా గ్రామ అభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అవధూత గిరి మహారాజ్ తెలిపారు. దాదాపు ఇప్పటివరకు సునీత భద్ర రెడ్డిలు అభివృద్ధి కోసం కోటి రూపాయల విరాళాన్ని అందజేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతి డాక్టర్ సిద్దేశ్వర నందగిరి మహారాజ్, గ్రామ సర్పంచ్ రాజు, గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు.






