26 June, 2026 | 2:30 AM

విద్యాహక్కు చట్టం అమలు ప్రశ్నార్థకమేనా?

26-06-2026 01:29 AM
  1. చట్టానికి తూట్లు పొడుస్తున్న కొన్ని ‘ప్రైవేట్’ యాజమాన్యాలు 
  2. నిబంధనలు గాలికి.. మౌనం వీడని విద్యాశాఖ! 

వనపర్తి, జూన్ 25 (విజయక్రాంతి) : ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం (రైట్ టూ ఎడ్యుకేషన్ యాక్ట్ - ఆర్ టి ఈ ), 2009 అమలు విషయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే వి మర్శలు వినిపిస్తున్నాయి. బలహీన వర్గాల పిల్లలకు విద్యను అందుబాటులోకి తీ సుకురావాల్సిన ఈ చట్టం కొన్ని ప్రైవేట్ స్కూల్స్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లో పంతో నీరుగారుతోందనే ఆరోపణలున్నాయి. 

చట్టం నిబంధనలు ఇలా..

విద్యను ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కుగా గుర్తించిన భారత ప్రభుత్వం 2009లో వి ద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయ స్సు గల ప్రతి బాలబాలికకు ఉచితంగా, త ప్పనిసరిగా విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, బలహీ న వర్గాల పిల్లలకు ప్రవేశాల్లో 25 శాతం రిజర్వేషన్ కల్పించాలనే నిబంధన ఉంది. అయి తే కొన్ని ప్రాంతాల్లో ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు, అదనపు చార్జీలు, పుస్తకాలు, యూనిఫామ్ల కొనుగోలులో ఒత్తిడి పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

విద్య హక్కా..? వ్యాపారమా..? 

విద్యార్థుల నుంచి పలు రకాల పేర్లతో వసూళ్లు చేయడం, పాఠశాల సూచించిన చోటే పుస్తకాలు కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలు వి ద్యా హక్కు చట్టం స్ఫూర్తికి విరుద్ధమని వి ద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

25 శాతం రిజర్వేషన్ అమలేదీ? 

విద్యా హక్కు చట్టంలో కీలకమైన అంశమైన 25 శాతం సీట్ల కేటాయింపు ప్రక్రియపై కూడా అనేక చోట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన పేద విద్యార్థులకు అవకాశం కల్పించాల్సిన చోట సరైన అవగాహన లేకపోవడం, అమలులో నిర్లక్ష్యం కా రణంగా అనేక మంది పిల్లలు ప్రయోజనం పొందలేకపోతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు.

అధికారుల మౌనం వెనుక కారణమేంటి? 

ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న వ్యవహారాలపై విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే పాఠశాల లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కేవలం పర్యవేక్షణకే పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. విద్యా హక్కు చట్టం పు స్తకాలకే పరిమితమవుతుందా? లేక ప్రతి చి న్నారికి అందేలా అధికారులు చర్యలు తీసుకుంటారా...? అన్నది వేచి చూడాల్సిందే.