9 April, 2026 | 2:00 AM

ఎంబీఏ విద్యార్థినులకు అసభ్య సందేశాలు

09-04-2026 12:05 AM

డీన్, ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ 

తోటి విద్యార్థుల దాడి

మేడ్చల్ జిల్లా పర్వతాపూర్‌లోని అరోరా యూనివర్సిటీలో ఘటన 

మేడ్చల్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన డీన్, మరో ఇద్దరూ ఉద్యోగులు విద్యార్థినులకు అసభ్య సందేశాలు పంపడం, ఆ తర్వాత పరిణామాలతో ఆరోర యూనివర్సిటీలో ఉద్రిక్తతకు దారి తీసింది.

మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్ శివారులోని ఆరోరా యూనివర్సిటీలో కొత్తగా చేరిన ఎంబీఏ విద్యార్థినులకు డీన్, మరో ఇద్దరు ఉద్యోగులు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరో పణలు వచ్చాయి. ఈ విషయం తోటి విద్యార్థులకు తెలియడంతో డీన్, ఇద్దరు ఉద్యోగు లను చితకబాదారు. తమపై విద్యార్థులు దాడి చేశారని డీన్ ఇద్దరు ఉద్యోగులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసభ్య సందేశాలు పంపి తప్పు చేయడమే గాక తమపైనే కేసులు పెడతారా అంటూ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు.

యూనివర్సిటీ యాజమాన్యం సైతం డీన్, ఇద్దరు ఉద్యోగులకే మద్దతు పలికి విద్యార్థులను సస్పెండ్ చేయడానికి సిద్ధమైంది. దీంతో విద్యార్థి సంఘాలు యూనివర్సిటీకి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకోవాలని, అసభ్య సందేశాలు పంపిన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పలువురు నాయకులు వచ్చి యాజమాన్యంతో చర్చించారు. ఎట్టకేలకు యాజ మాన్యం దిగివచ్చి డీన్, ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. విద్యార్థులపై చర్యలను ఉపసంహరించుకుంది.