8 June, 2026 | 4:41 PM

Breaking News

పూర్తి వేతనం విడుదల చేయాలని లెక్చరర్ల వినతి

08-06-2026 03:49 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సోషల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన పార్ట్‌టైం లెక్చరర్లు వేతనం చెల్లించాలని సోమవారం అడిషనల్ కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం సమర్పించారు. మార్చి నెలకు కేవలం 13 రోజుల జీతం మాత్రమే చెల్లించారని, మిగిలిన 18 రోజుల వేతనం వెంటనే విడుదల చేయాలని కోరారు. పూర్తి వేతనం చెల్లించాలని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ సర్క్యులర్ ఉన్నప్పటికీ అమలు కాలేదని తెలిపారు. బోధనతో పాటు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.