9 April, 2026 | 2:00 AM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

09-04-2026 12:02 AM

బీఆర్‌ఎస్ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి 

ఎల్బీనగర్, ఏప్రిల్ 8: ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్‌ఎస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి మరోసారి సేవాస్పూర్తిని చాటుకున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచనలతో దోమలపై యుద్ధం కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మూసీ నది ప్రాంతంలో ఉన్న చైతన్యపురి డివిజన్‌లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ మేరకు రెండు ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేయగా, బుధవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఫాగింగ్ యంత్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... దోమల నియంత్రణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫల మైందన్నారు. ప్రభుత్వం ప్రజా ఆరోగ్య సమస్యలపై మరింత దృష్టి సారించాలని సూచిం చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తోట మహేష్ యాదవ్, శివ ప్రకాశ్, లక్ష్మీ నారాయణ గౌడ్, విశ్వప్రేమ్, శ్రీహరి, తులసి కృష్ణ గౌడ్, జలంధర్, పులి కిరణ్, సాయి, నరేశ్, గణేశ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.