1 March, 2026 | 3:24 AM

కన్నతల్లిని కాల్చి చంపిన కొడుకు

01-03-2026 01:36 AM

బతికుండగానే పాత బట్టలు మీద వేసి నిప్పు

నిజామాబాద్ జిల్లా బ్రాహ్మణగల్లీలో ఘటన

నిజామాబాద్/బాన్సువాడ, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): నవ మాసాలు కనిపించిన తల్లిని కొడుకు ఇంట్లోని గుడ్డలు వేసి కాల్చిచంపిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బ్రాహ్మణగల్లీలో శనివారం వెలు గు చూసింది. బ్రాహ్మణగల్లీకి చెందిన భూ మవ్వకు కొడుకు మానాజీ ఉన్నాడు. మద్యానికి బానిసై, తరచూ తల్లితో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మద్యం మత్తులో గొడవపడి విచక్షణారహితంగా దాడిచేశాడు. ప్రాణంతో ఉండగానే  ఇంట్లోని పాతదుస్తులేసి నిప్పంటించి, చం పాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.