6 March, 2026 | 4:38 AM

వృద్ధురాలికి కూతురు, అల్లుడి మోసం

06-03-2026 02:54 AM

రూ.కోటి, బంగారం మాయం!

బీజేపీ నాయకుడు దుమాల శ్రీకాంత్ ఇంటి ఎదుట బాధితురాలి ఆందోళన

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘటన

రాజన్న సిరిసిల్ల, మార్చి 5 (విజయక్రాంతి): వృద్ధురాలి అని చూడకుండా ఆమె వద్ద ఉన్న రూ.కోటికి పైగా నగదు, దాదాపు తొమ్మిది తులాల బంగారం మాయం చేశారు సొంత కూతురు, అల్లుడు. తన కూతురు, అల్లుడు (బీజేపీ నాయకుడు)పై తీవ్ర ఆరోపణలు చేస్తూ వారి ఇంటి ఎదుట బాధితురాలు ధర్నాకు దిగిన ఘటన సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌లో జరిగింది.

బాధితురాలు రేవతి తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త (ప్రభుత్వ ఉద్యోగి) మరణానంతరం వచ్చిన పెన్షన్ డబ్బులు, ఉద్యోగానికి సంబంధించిన బెనిఫిట్స్ సహా కోటి రూపాయలకు పైగా నగదు తన కూతు రు, అల్లుడు మోసపూరితంగా తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తన వద్ద ఉన్న బంగారం కూడా తీసుకుని తిరిగి ఇవ్వలేదని వాపోయారు.

ప్రస్తు తం తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, చికిత్స కోసం తన డబ్బు లు కావాలని అడిగినా స్పందించడం లేదని చెప్పింది. ఈ వ్యవహారంలో అల్లు డు, బీజేపీ నాయకుడైన దుమాల శ్రీకాంత్ కీలక పాత్ర పోషించాడని రేవతి ఆరోపించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రేవతిని స్టేషన్‌కు తరలించి ఫిర్యాదు, స్వీకరించారు.