4 June, 2026 | 1:29 PM

వరిగడ్డికి మంటలు

04-06-2026 12:14 PM

వేగంగా స్పందించిన ఫైర్ సిబ్బంది

తప్పిన పెను ప్రమాదం

కోటపల్లి, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎడగట్ట గ్రామంలో వరిగడ్డికి నిప్పు అంటుకున్న ఘటన గ్రామస్తులను ఆందోళనకు గురి చేసింది. పంట పొలంలో వరిగడ్డిని కాల్చేందుకు రైతు నిప్పు పెట్టగా, మంటలు ఒక్కసారిగా వేగంగా వ్యాపించి మొత్తం గడ్డి దగ్ధమైంది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

మంటలు మరింత విస్తరించి గ్రామ సమీప ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉందని గుర్తించిన గ్రామస్తులు వెంటనే చెన్నూర్ అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. సరైన సమయానికి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని గ్రామస్తులు పేర్కొన్నారు.