బెల్లంపల్లిలో విద్యుత్ కార్మికుల ధర్నా
బెల్లంపల్లి,(విజయక్రాంతి): విద్యుత్ ఆర్టిసన్, అనామ్యాన్డ్, పీస్ రేటెడ్ కార్మికుల సమస్యల సాధనకోసం రాష్టంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్,ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటి (ఐటీవిఎఎల్ఐసి) ఇచ్చిన పిలుపు మేరకు బెల్లంపల్లి విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట విద్యుత్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ బెల్లంపల్లి డివిజన్ నాయకులు దేవేందర్, నవీన్, సుభాకర్,సింగారావు ఆనంద్ మాట్లాడారు.
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టీసన్ లకు, అన్మాన్, పీస్ రేటెడ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిసన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్అమలు చేయాలనిన్నారు. పీస్ రేటెడ్ కార్మికులకు, ఆర్టిసన్లకు ఏ పీ ఎస్ ఈ బీ సర్వీస్ రూల్స్ మలు చేసి అంటే, ప్రస్తుతం ఉన్న వో అండ్ ఎం సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీజీ ఎన్పీపీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ లలో ఆన్- మ్యాన్డ్ వర్కర్లను ఆర్టీసన్ లు గా విలీనం చేయాలని కోరారు. ఏప్రిల్ ఏడో తేదీలో పరిష్కరించకుంటే 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగ విద్యుత్ ఉద్యోగుల సమ్మె చేపడుతున్నట్లు హెచ్చరించారు. ధర్నా లో ఆర్టీసన్ సంఘం నాయకులు ఎం శంకర్,జీ శ్రీనివాస్, జీ శ్రీను, ఎం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




