జీవో నెంబర్ 76 కారణంగా నిలిచిపోయిన ఇళ్ల పట్టాలను తక్షణం మంజూరు చేయాలి
జీవోలు మారుతున్నాయే తప్ప పేదవాడి ఇంటి కల కలగానే మిగిలిపోతుంది
బిజెపి కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జీవోలు మారుతున్నాయి తప్ప పేదవాడి సొంత ఇంటి కల నెరవేరడం లేదని భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం. విద్యా సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఐడిఓసిలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసి సమస్య తక్షణమే పరిష్కరించవలసిందిగా కోరారు. 76 జి. ఓ పేద,మధ్యతరగతి ప్రజలకు ఇవ్వవలసిన ఇళ్ల పట్టాలు నిలిచిపోయాయి. దీని వల్ల అర్హులైన లబ్ధిదారులు తమ హక్కులను కోల్పోతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇళ్ల పట్టాలు లేకపోవడంతో వారు గృహ రుణాలు పొందలేకపోతున్నారు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా అందుకోవడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఈ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు నోముల. రమేష్, రాజమౌగిలి మరియు కార్యకర్తలు వీరు, శశిధర్, చారి తదితరులు పాలొగొన్నారు




