11 April, 2026 | 2:06 AM

ఆదాయం పెరిగింది

11-04-2026 12:00 AM
  1. ఏఐ టెక్నాలజీ, పన్నుల పర్యవేక్షణతో సత్ఫలితాలు
  2. ప్రతి శుక్రవారం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  4. భూముల విక్రయానికి ప్రపంచస్థాయిలో ప్రచారం చేయాలి
  5. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం, వివిధశాఖల్లో పన్నుల ద్వారా వస్తున్న ఆదా యంపై నిరంతరం సమీక్ష, పకడ్బందీ నిర్వ హణతో వివిధశాఖల్లో ఆదాయం పెరుగుద ల కనిపిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క అన్నారు. కమర్షియల్ టాక్స్, రిజిస్ట్రే షన్ శాఖల్లో రాబడి పెరుగుతోందని, ప్రతి శుక్రవారం క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశం ఉంటుందని తెలిపారు.

శుక్రవారం సచివాల యంలో రెవెన్యూ జనరేషన్, రిసోర్స్ మొబ లైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం డిప్యూటీ సీఎం అధ్యక్షతన జరిగింది. సమా వేశంలో సభ్యులు, మంత్రులు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ... ఏఐ టెక్నాలజీ వినియోగంతో మైనింగ్, రవాణా శాఖల్లో ఆదాయ వనరులను పెంచుకోగలి గామని తెలిపారు.

అధికారులు మరింత పకడ్బందీగా పనిచేసి, ఇసుక, క్రషర్ మైనింగ్ విభాగాల్లో అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వంటి అంశాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టా లన్నారు. నిరంతరం సమీక్షలు, పన్నుల నిర్వహణలో పకడ్బందీ చర్యల మూలంగా కమర్షియల్ టాక్స్‌శాఖలో జీఎస్టీ ఆదాయం మూడు నెలలుగా 15 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. ఇదే తరహాలో రిజిస్ట్రేష న్‌శాఖలోనూ ఆదాయం ఉందని చెప్పారు. ఆదాయ వనరులను పెంచుకునేందుకు ప్రతి శుక్రవారం క్యాబినెట్ సబ్ కమిటీ సమావే శం నిర్వహిస్తామన్నారు.

2047 వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధన లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకున్నా, ఆ మేర కు అన్ని శాఖలు ఆదాయ సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారు లను ఆదేశించారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యం లో భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచస్థాయిలో ప్రచారం నిర్వహించాలని, ఈ అంశంపై అందరికీ ముందస్తుగా సమా చారం అందడం మూలంగా ఆదాయ వన రులు పెరిగే అవకాశం ఉంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

భూముల విలువ పెంపునకు రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వ ర్యంలో ఇప్పటికే వివిధ కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం పూర్తిచేశారు. ఆ నివేదికల ను ముందుగా సబ్ కమిటీకి సమర్పించి ఆ తర్వాత క్యాబినెట్‌కు నివేదించేందుకు అవస రమైన చర్యలు చేపట్టాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

మెట్రో రైల్ స్వాధీనం, నిర్వహణ, ఆదాయ, వ్యయ మార్గాలపైన అధికారులతో మంత్రు లు సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవెన్యూ, పరిశ్రమల శాఖలోనూ ఆదాయం పెంపున కు సంబంధించి చేపట్టిన చర్యలు.. ఫలితాల పై మంత్రులు సమీక్ష చేశారు. ప్రతి సమావే శంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ఫలితా లు యాక్షన్ టేకెన్ రిపోర్టుతో తదుపరి సమావేశానికి రావాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.