11 April, 2026 | 2:06 AM

వర్క్ షాప్‌ను వినియోగించుకోండి

11-04-2026 12:00 AM

నిర్మల్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17న జిల్లాస్థాయి వర్క్ షాప్ సమావేశం నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కే ముత్యంరెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించి ఈ వర్క్ షాప్ సమావేశంలో పోలీస్, రెవిన్యూ, వ్యవసాయ శాఖ, కార్మిక శాఖ, తదితర రంగాల్లో బాల కార్మికుల నిర్మూలన, వ్యవసాయ కార్మిక సమస్యలు, బాల కార్మికుల గుర్తింపు రక్షణ, కార్మిక చట్టాలు, బాల బాలికల విద్య తదితర అంశాలపై అంతర్జాతీయ కార్మిక సమైక్య ప్రతినిధులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సభ్యులు చేసుకోవాలని కోరారు.