27 June, 2026 | 2:19 PM

Breaking News

మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •   నిండు వర్షంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి   •   బాన్సువాడ కల్కి చెరువు కట్టకు బుంగ...   •  

జీవనోపాదులను పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

29-06-2025 12:21 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణంతో కుటుంబ జీవనోపాదులను పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఏ పి ఏం రాజు తెలిపినారు శనివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని మండల సమైక్య కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు గౌరు లక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలు సంఘాల ద్వారా తీసుకున్న రుణంతో కుటుంబాల జీవనోపాదులను పెంచుకోవాలని తెలపడం జరిగినది.

అలాగే బ్యాంకు, శ్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలను 100శాతం తిరిగి చెల్లించాలని తెలిపారు. సంఘంలోని ప్రతి మహిళ కు ఇన్సూరెన్స్ చేయించాలని సూచించడం జరిగినది అలాగే ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న కార్యకలాపాలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంఘం ద్వారా రుణాన్ని అందించాలని, వనమాహాత్సవంలో భాగంగా చెట్ల పెంపకం చేపట్టాలని, వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం నకు స్త్రీనిధి ఆర్ ఎం కిరణ్ కుమార్, సీ సిలు, గ్రామ సంఘ అధ్యక్షులు పాల్గొన్నారు.