24 August, 2026 | 10:30 PM

Breaking News

అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •  

సింగరేణి డైరెక్టర్ (పా)ను కలిసిన అఖిలపక్ష నాయకులు, ఓసీ నిర్వాసితులు

29-06-2025 12:24 AM

ఇల్లెందు టౌన్, (విజయక్రాంతి): ఇల్లందులో పర్యటించిన సింగరేణి సంస్థ డైరెక్టర్ ను జెకె 5 ఓసి విస్తరణ నిర్వాసితులు, అఖిలపక్ష నాయకులు కలిసి వినతిపత్రం శనివారం ఇచ్చారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ జెకె 5 విస్తరణ పేరుతో మొదలుపెట్టుతున్న ఓసి లో తమ ప్రాంతం  ఉందని 135  సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి పుట్టిన ఇల్లందులో ఈ ప్రాంతం నుండే బొగ్గునిక్షేపాలను కనుగొన్నారని ఈరోజు జె కే 5  విస్తరణలో భాగంగా తమ ఇల్లులు, పొలాలను కోల్పోతూ నిర్వాసితులుగా మారుతున్నామని సింగరేణి డైరెక్టర్ కు తెలిపారు.

ఇక్కడ సర్వే చేసిన ఇళ్లకు ఆర్ అండ్ ఆర్  ప్యాకేజీ వర్తింపజేయాలని గతంలో జెకె 5 ఓసి నిర్వహణలో వారికి ఆర్ అండ్ ఆర్ వర్తింప చేశారని అదే విధంగా 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ ఇచ్చారని, చెట్టు పుట్టకు కూడా ప్యాకేజీ ఇచ్చారని వారిలాగే ఈ ప్రాజెక్టులో ఉన్న తమకు అందించాలని వారు కోరారు అదేవిధంగా ఎఫెక్ట్ ఏరియాలో ఉన్న ప్రాంతాలను సింగరేణి దత్తత తీసుకోవాలని ముందుగా వాటిని ప్రభుత్వానికి అప్పజెప్పి పట్టాలు ఇప్పించాలని, అలాగే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు పిల్లలు ఉంటున్న క్వార్టర్స్ ను వారికి కేటాయించాలని, భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందించాలని,  అలాగే సింగరేణి సంస్థ భవిష్యత్తులో జరగబోయే టెండర్లలో వారికి అవకాశం కల్పించాలని, ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎఫెక్ట్ ఏరియాలను మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డైరెక్టర్ ను కోరారు.