"చలి" పులి పంజాకు "గజగజ" వణుకుతున్న జనం
13-11-2025 08:20 AM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వివిధ గ్రామాలతో పాటు పట్టణ కేంద్రంలో రెండు రోజుల నుండి చలి పులి పంజా విసురుతుండడంతో జనం గజగజ వణుకుతున్నారు. గత వారం రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడగా రెండు రోజుల నుండి చలి జనాన్ని ఇబ్బంది పెడుతుంది. చలి దాటికి జనం ఇండ్ల నుండి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. చలి నుండి రక్షించుకునేందుకు జనం స్వేటర్లను, ఉన్ని వస్త్రాలను ధరిస్తుండగా గ్రామాల నుండి వచ్చే పాలు, కూరగాయలు అమ్మేవారు చలికి భయపడుతుండగా గ్రామాల్లో ఎక్కడ చూసినా తెల్లవారుజామున జనం చలిమంటలు వేసుకుంటూ కనిపిస్తున్నారు. డాక్టర్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ చలికి ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు.




