26 July, 2026 | 12:02 PM

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై కేటీఆర్ కు వినవిస్తా: ఎమ్మెల్యే

26-07-2026 10:56 AM

బోథ్,(విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామని స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ పేర్కొన్నారు. ఆదివారం వివిధ మండలాల చెందిన ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వినతిపత్రం ద్వారా అందించారు. 2017 నుండి 2021 సంవత్సరం వరకు పిఆర్సి బకాయిలు గ్రాడ్యుటీ డిఫరెన్స్ కు సంబంధించిన డబ్బులు ఇంతవరకు అందలేదని వారు ఎమ్మెల్యే వివరించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఈ సినిమా ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేయాలని కోరారు.స్పందించిన ఎమ్మెల్యే సమస్యను టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.