12 March, 2026 | 9:19 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

పెరుగుతున్న కిడ్నీ సమస్యలు

12-03-2026 01:49 AM
  1. ముందస్తు గుర్తింపే కీలకం

కిమ్స్ ఆస్పత్రి వైద్యుడు రవి

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): మార్చి 12న కిడ్నీ డేను పురస్కరించుకుని ఈ సంవత్సరం ‘కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ కేరింగ్ ఫర్ పిపుల్, ప్రొటెక్టింగ్ ద ప్లానెట్’ అనే నినాదంతో ముందుకెళ్తున్నట్టు డాక్టర్ ఈ.రవి (కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి.

అయితే చాలా మందికి ఈ సమస్య ఉందని తెలిసే సమయానికి అది చాలా దశల్లోకి వెళ్లిపోతుంది. ప్రపంచంలో సుమారు 10 శాతం మంది పెద్దల్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ కనిపిస్తున్నట్లు అధ్యయనాలు చెపు తున్నాయి. ముఖ్యంగా మ ధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, పొగతాగడం, కుటుంబంలో కిడ్నీ వ్యాధు ల చరిత్ర ఉండటం, ఎక్కువ కాలం నొప్పి నివారణ మం దులు లేదా కిడ్నీలకు హానికరమైన మందులు వాడటం వంటి కారణా లు కిడ్నీ వ్యాధులకు ప్రధాన ప్రమాద కారకాలు. కిడ్నీ వ్యాధులను చాలా సందర్భాల్లో ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు.

మధుమేహం, రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. కిడ్నీ వ్యాధి తీవ్ర స్థాయికి చేరుకుంటే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ వస్తుంది. అప్పుడు రోగులకు డయాలిసిస్ లేదా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అవసరం అవుతుంది. కిడ్నీ దాత ల కొరత ఉండటంతో, ముం దుగానే జాగ్రత్తలు తీసుకో వడం, వ్యాధిని తొందరగా గుర్తించడం అత్యంత ము ఖ్యం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, అవసరం లేకుండా మందులు వాడకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీ వ్యాధులను నివారించవచ్చు’ అని చెప్పారు.