సింగరేణి మారుపేర్ల అభ్యర్థుల ఆమరణ నిరాహార దీక్ష
- దీక్షలో క్షీణిస్తున్న పలువురి ఆరోగ్యం
- విజిలెన్స్ పెండింగ్ కేసులపై తక్షణమే న్యాయం చేయాలి
కొత్తగూడెం, ఆగస్టు 16, (విజయక్రాంతి ): విజిలెన్స్ పెండింగ్ కేసుల్లో తక్షణమే న్యా యం చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదురుగా 60 గంటలుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. దీక్షలో పా ల్గొన్న లక్కా శ్రావణ్ గౌడ్ ఆరోగ్యం క్షీణిస్తుం ది. సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం కొనసాగుతున్న, ఆమరణ నిరాహార దీక్ష 60 గంటలు దాటింది.
ఈ సందర్భంగా లక్కా శ్రావణ్ మాట్లాడుతూ..ఏళ్ల తరబడి ఉద్యోగాల కో సం ఎదురుచూస్తున్న బాధితులు తమ దీక్ష ను చేపట్టాల్సి వచ్చింది అన్నారు. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్షను విరమించమని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందిం చి బాధితులతో చర్చలు జరిపి, ఉద్యోగాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, ఆరోగ్య పరిస్థితి విషమించేలోపే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని తమ కుటుంబాలకు న్యాయం చే యాలని బాధితులు వేడుకుంటున్నారు.






