17 August, 2026 | 3:45 AM

ఘనంగా మాజీ ప్రధాని వాజ్ పేయి వర్ధంతి

17-08-2026 02:08 AM

సంస్థాన్ నారాయణపూర్,ఆగస్టు 16 : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతిని నారాయణపురం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారత రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు, దేశభక్తికి ప్రతీకగా వాజ్ పేయి నిలిచారని అన్నారు.తన అసాధారణ వాగ్ధాటి,ప్రజల పట్ల సేవాభావం జాతీయ సమగ్రతపై దృఢమైన నిబద్ధతతో దేశప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. వాజ్ పేయిని ఆదర్శంగా తీసుకొని దేశ నిర్మాణంలో యువకులు భాగస్వాములు కావాలని అన్నారు. బీజేవైఎం నాయకులు ఉష్కగుల గిరి, చిలువేరు వెంకటేశం, వంగరి రఘు, శివాజీ, లక్ష్మీనారాయణ, ఇంద్ర సేనారెడ్డి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.