17 August, 2026 | 3:58 AM

నూతన ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

17-08-2026 02:07 AM

వెంకటాపూర్, ఆగస్టు 16 (విజయక్రాంతి):మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దోమ్మటి రమేష్ అధ్యక్షతన నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా గడ్డమీది అశోక్, ఉపాధ్యక్షులుగా కుక్క అశోక్, గడ్డం రమేష్, అధికార ప్రతినిధిగా చంటి ప్రభుదాస్, ప్రధాన కార్యదర్శులుగా నల్లగొండ మల్లేష్, కాడపాక రాజు, కోశాధికారిగా మైస సంపత్, సహాయ కార్యదర్శిగా రాసవెల్లి భాస్కర్, కార్యదర్శులుగా గడ్డమీది సృజన్, బోడ మొగిలి, మాజీ సర్పంచ్ గడ్డమీది దేవేందర్ లను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల ఇంచార్జి కాడపాక శ్యామ్ హాజరై మాట్లాడుతూ..

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ కోసం రాజీలేని పోరాటం చేసి సాధించిందని, మాదిగలతో పాటు అణగారిన, పేద వర్గాల సంక్షేమం కోసం ఉద్యమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కుల వివక్ష, సామాజిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణం కోసం గ్రామస్థాయి నుంచి ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని అనుబంధ కమిటీల పునర్నిర్మాణంలో భాగంగా నూతన గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని అన్నారు.