ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
రామచంద్రపురం ఆగస్టు 15: రామచంద్రాపురం 268వ డివిజన్‌లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రామచంద్రాపురం 268వ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, పద్మావతి, బసమ్మ, సంతోషి, రవి యాదవ్, శ్రీశైలం, తోపా రాజు తదితరులు పాల్గొన్నారు.






