15 August, 2026 | 4:50 PM

సిపిఐ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన పంజాల శ్రీనివాస్

15-08-2026 02:40 PM

ముకరంపుర, ఆగస్టు 15(విజయక్రాంతి): భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు గడిచి 80వ సంవత్సరంలోకి  అడుగు పెడుతున్నా దేశంలో పేదల బ్రతుకులు మారడం లేదని,పాలకులు అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను శ్రీనివాస్ ఎగురవేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని జరిగిన వీరోచిత పోరాటంలో సిపిఐ  కీలక పాత్ర పోషించిందని,ఎందరో మహానుభావులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారని, స్వాతంత్ర్యం అనంతరం దేశంలో పరిపాలన కొనసాగించిన పేదల బ్రతుకులు మారడం లేదనీ దేశ స్వాతంత్ర్య ఉద్యమం మొదలుకొని నేటి వరకు సిపిఐ ప్రజల పక్షాన నిలబడి వారి హక్కులు,సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ పోరాడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి,నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు