15-08-2025 12:56:20 PM
కరీంనగర్,(విజయక్రాంతి): స్థానిక నగరంలోని పారమిత విద్యాసంస్థలు, ఎక్స్ ప్లోరికా లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు(Independence Day celebrations) ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా పారమిత విద్యాసంస్థల డైరెక్టర్స్ వివిధ పాఠశాలల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థులు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థులచే నిర్వహించబడిన మార్చ్ ఫాస్ట్ చూపరులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డా.ఇ.ప్రసాదరావు సందర్భంగా విద్యార్థులకు, తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, అనుకర్ రావు, వినోద్ రావు, రాకేశ్, వి.యు.యం.ప్రసాద్, రమణ,హనుమంత రావు, ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ, బాలాజీ, ప్రశాంత్, కవిత, శర్మిష్ఠ, శ్రీకర్, సమన్వయకర్తలు, ఉపాద్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.