15-08-2025 01:36:13 PM
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం దేశ ప్రజలకు 79వ స్వాతంత్య్ర దినోత్సవ(Independence Day) శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడానికి ప్రతి ఒక్కరూ మరింత కష్టపడి పనిచేయాలని కోరారు. "అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసుకోవడానికి, విక్షిత్ భారత్‌ను నిర్మించడానికి మరింత కష్టపడి పనిచేయడానికి ఈ రోజు మనల్ని ప్రేరేపించుగాక. జై హింద్" అని మోడీ ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.