15-08-2025 01:00:39 PM
ముత్తారం,(విజయక్రాంతి): మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షులు, ముత్తారం మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, డైరెక్టర్లు, ముత్తారం మండలం తాజా మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్, మైనార్టీ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.