calender_icon.png 15 August, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2025 12:47:13 PM

కరీంనగర్,(విజయక్రాంతి): జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు జి.వి. రామకృష్ణారావు ఆధ్వర్యంలో మొదటగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనాలు అర్పించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సీనియర్ నాయకుడు నారదాసు లక్ష్మణరావు, నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్,పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.