calender_icon.png 15 August, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం రేవంత్

15-08-2025 01:09:37 PM

హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కోట వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. అంతకు ముందు స్వాతంత్య దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డి  జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు.