15 August, 2026 | 3:27 PM

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 02:29 PM

చేర్యాల,ఆగస్టు 15 (విజయక్రాంతి): 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల పట్టణంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు, నామినేటెడ్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.