15 August, 2026 | 3:26 PM

జెండా ఎగరేసిన నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

15-08-2026 02:31 PM

నిర్మల్ ,ఆగస్టు 14 ( విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ బిజే ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాస భవనంలో శనివారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనపై అప్పటి మహా నాయకులు పోరాటం చేసి స్వతంత్ర భారతదేశంలో 1947లో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. భారతదేశంలో మోడీ నాయకత్వంలో తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్. పార్టీ నాయకులు రమణారెడ్డి చంద్రకాంత్ తదితరులు ఉన్నారు.