15-11-2025 02:19:32 PM
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో భారత్(India vs South Africa) తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులకే కుప్పకూల్చింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 15 పరుగులకు ఆలౌట్ అయింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై జాన్సెన్ (3/35), హార్మర్ (4/30) తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కేవలం 30 పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. రాత్రిపూట 1 వికెట్ నష్టానికి 37 పరుగులతో ఉన్న భారత్ ఆటను ప్రారంభించింది.భారత జట్టులో కెఎల్ రాహుల్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్(2), రిషబ్ పంత్(27), రవీంద్ర జడేజా (27)పరుగులు చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో రెండో రోజు శనివారం సైమన్ హార్మర్ బౌలింగ్‌లో స్లాగ్ స్వీప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మెడ బెణుకుతో భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ రిటైర్డ్ అయ్యాడు. గాయం కారణంగా అతను మైదానం నుండి బయటకు వచ్చే ముందు గిల్ కేవలం మూడు బంతులు మాత్రమే ఆడాడు.