23 June, 2026 | 8:15 AM

లారీని ఢీ కొట్టిన బస్సు

22-02-2026 12:13 PM

- త్రుటిలో తప్పిన ప్రమాదం

- డ్రైవర్ కు గాయాలు

గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై  లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీ కొట్టింది.  కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్నది. ఈ క్రమంలో ప్రజ్ఞాపూర్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు మీద  బస్సు డ్రైవర్ ఇమ్రాన్ ఖాన్ (36) నిద్రమత్తులో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. డ్రైవర్ ఇమ్రాన్ ఖాన్ కి  తలకు స్వల్ప గాయాలు కాగా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా ఉన్నారు.