15 June, 2026 | 2:25 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

కోడిపందాలు నిర్వాహకులను పోలీసులు అరెస్టు

22-02-2026 12:06 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి మండలం గంగారం గ్రామ శివారు ప్రకాష్ నగర్ కాలనీలో పేకాట ఆడుతున్న 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.65,000, 2  కోడిపుంజులు, 2 కత్తులు, 6  మోటార్ సైకిళ్ళు, 11 కార్లు  స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరు ఏసిపి వసుంధర యాదవ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో శనివారం తెల్లవారుజామున ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఎస్సై అశోక్ కుమార్ తన సిబ్బందితో సత్తుపల్లి మండలం, గంగారం గ్రామం ప్రకాష్ నగర్ కాలనీ శివారులో గల దూదిగం కొటేశ్ కి చెందిన పామాయిల్ తోటలో తనిఖీలు నిర్వహించామన్నారు.

ఈ తనిఖీల్లో కోడిపందేలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడిచేసి 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు.  వారిని పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తునట్లు కల్లూరు ఏసీపీ వసుందర యాదవ్ తెలిపారు. పట్టుబడిన వారిని కోడిపందేలు నిర్వహిస్తే వచ్చే ఆర్ధిక  ఇబ్బందుల గురించి,కేసుల వలన జరిగే నష్టాల గురించి  కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నిందితులను  బైండవర్ నిమిత్తం సత్తుపల్లి తహసీల్దారు ముందు హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. కల్లూరు సబ్ డివిజన్ పరిదిలో గల పోలీసు స్టేషన్ల పరిధిలో   ఎటువంటి కోడిపందేలు, పేకాట,ఆన్లైన్ బెట్టింగ్  మరియు అక్రమ ఇసుక రవాణా మొదలయినవి నిర్వహిస్తే పోలీసు అధికారులకు తెలియజేయాలని వారి వివరాలు వారికి గోప్యంగా ఉంటాయని  ఏసీపీ తెలిపారు.