15 June, 2026 | 3:13 PM

Breaking News

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •  

అర్థరాత్రి అడవుల్లో తవ్వకాలు

22-02-2026 12:01 PM

గుప్త నిధుల కోసమేనా...?

మహబూబాబాద్,(విజయక్రాంతి): అధికారుల పేరుతో మహబూబాబాద్ జిల్లా గూడూరు అడవుల్లో జేసీబీలతో కొందరు శనివారం రాత్రి తవ్వకాలు జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం, ఒక జేసిబీతో గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు  అర్ధరాత్రి అటవీ ప్రాంతాలలో తవ్వకాలను ప్రారంభించారు. రెండు చోట్ల నాలుగు నుండి ఎనిమిది ఫీట్ల లోతు వరకు తవ్వి వదిలిపెట్టి నేషనల్ 360 హైవే రోడ్డు సమీపంలో మరో మారు తవ్వకాలు జరుపుతున్న సమయంలో సీతానగరం గ్రామపంచాయతీ భూక్యతృ తండాకు చెందిన కొంతమంది యువకులు గుర్తించి ఆ వ్యక్తులను ఆరా తీశారు.

మేము అధికారులం ఇక్కడినుండి బియ్యం లారీ వెళుతుందని సమాచారంతో ఇక్కడ నిలబడ్డామని సమాధానం ఇవ్వగా నిజమే అనుకున్నారు. అయితే అడవి ప్రాంతంలో జేసీబీ సహాయంతో తవ్వకాలను జరుపుతుంటే చూసి, అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నించగా ఆ వ్యక్తులు తడబడ్డారు. ఈ విషయంపై స్థానిక అటవీ శాఖ, పోలీస్ అధికారులుకు ఫిర్యాదు చేయగా అటవీశాఖ అధికారులు వచ్చేలోపు ఆ వ్యక్తులు పరారయ్యారు.

అటవీ ప్రాంతంలో జరిపిన తవ్వకాలను చూసి అధికారులు షాక్ అయ్యారు. ఈ తవ్వకాలు ఎందుకు చేశారో దేనికి కోసం చేశారా అనే సందిగ్ధంలో పడ్డారు. ఇది దాదాపు గుప్త నిధుల తవ్వకాలే కోసమని ఇది గుప్త నిధుల కోసం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తవ్వకాలకు సంబంధించిన పూర్తి విషయాలు పూర్తి సమాచారంతో వెల్లడిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు.