24 July, 2026 | 10:40 AM

మహారాష్ట్రలో ’ఇండియా’ పైచేయి..

05-06-2024 02:28 AM

మహారాష్ట్రలో ఇండియా కూటమి పైచేయి సాధించింది. మొత్తం 48 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇండియా కూటమి 29 స్థానాల్లో గెలుపొందగా, ఎన్డీఏ అభ్యర్థులు 18 స్థానాల్లో, ఒకరు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 12 చోట్ల, శివసేన (ఉద్ధవ్ బాలసాహెబ్ థాక్రే) 10, ఎన్సీపీ(శరద్‌పవార్) 7 చోట్ల విజయబావుటా ఎగురవేశాయి. ఎన్డీఏలోని బీజేపీ 11, ఎన్సీపీ 1, శివసేన (ఎస్‌హెచ్‌ఎస్) 6 స్థానాల్లో గెలుపొందాయి. కాగా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ నుంచి, పీయూష్ గోయెల్ ఉత్తర ముంబై స్థానంలో, నారాయణ్ రాణే రత్నగిరి స్థానంలో గెలిచారు. బారామతిలో సుప్రియా సూలే.. అజిత్‌పవార్ భార్య సునేత్ర పవార్‌పై విజయం సాధించారు. అమరావతిలో సినీనటి, సిట్టింగ్ ఎంపీ నవనీత్ కౌర్ ఓడిపోయారు.