బీజేపీ క్లీన్ స్వీప్
ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. రాజధానిలోని ఉన్న ఏడు లోక్‌సభ నియోజకవర్గాలు అన్నింటిలోనూ కాషాయ అభ్యర్థులు విజయం సాధించారు. ఈశాన్య ఢిల్లీలో కన్హయ్యకుమార్‌పై బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ భారీ మెజారిటీతో గెలిచారు. ఒక్క చోట కూడా బీజేపీ అభ్యర్థులకు ఇండియా కూటమి అభ్యర్థులు పోటీ ఇవ్వలేకపోయారు. ఇండియా కూటమిలో ఆప్ తరఫున నలుగురు, కాంగ్రెస్ తరఫున ముగ్గురు బరిలో నిలిచారు. లిక్కర్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై వచ్చి ప్రచారం చేసినా ఆప్ నిలబడలేకపోయింది. జైలుకెళ్లిన సెంటిమెంట్ కూడా కేజ్రీవాల్‌కు సహకరించలేదు. బీజేపీ మాత్రం తన వ్యూహాలతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఢిల్లీలో 2014, 2019 రెండు పర్యాయాల్లోనూ బీజేపీ సంపూర్ణ విజయం సాధించడం గమనార్హం. ఢిల్లీ ఒక సీట్ ఎస్సీలకు కేటాయించారు.






