24 July, 2026 | 9:32 AM

బీహార్‌లో ఎన్డీఏ విజయబావుటా..

05-06-2024 02:30 AM

బీహార్‌లో ఎన్డీఏ హవా కొనసాగింది. మొత్తం 40 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు 30 చోట్ల, ఇండియా కూటమి అభ్యర్థులు 9 చోట్ల, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఎన్డీఏలోని జనతాదళ్(యునైటెడ్) 12, బీజేపీ 12, లోక్ జనశక్తి పార్టీ 5, హిందుస్థాని ఆవామ్ మోర్చా(సెక్యులర్) ఒకచోట సత్తా చాటాయి. ఇండియా కూటమిలోని రాష్ట్రీయ జనతాదళ్ 4, కాంగ్రెస్ 3, సీపీఐ(ఎంఎల్)(ఎల్) 2 స్థానాల్లో విజయం సాధించాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీ(యూ) 16 స్థానాల్లో పోటీపడగా 12 చోట్ల గెలుపొందింది. బీజేపీ 17 చోట్ల బరిలో నిలవగా 12, కాంగ్రెస్ 9 స్థానాలకు గాను 3 చోట్ల విజయం సాధించాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో పరాజయం పాలయ్యారు. చిరాగ్ పాసవాన్ హాజీపూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.