మోదీ పాలనలో అగ్రగామిగా భారత్
సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యం
ములుగులో గిరిజన వర్సిటీ ఘనత బీజేపీదే
బీజేపీ హయాంలోనే నేషనల్ హైవేల అభివృద్ధి
లక్షలాదిగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు
నర్సంపేట జనసభలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ దామి
వరంగల్, మే 6 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీ పాలనలోనే భారతదేశం అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిచిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ దామీ అన్నారు. సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. నర్సంపేటలో సోమవారం నిర్వహించిన జనసభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ముస్లిం ఆడబిడ్డల హక్కులను కాపాడేందుకు ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశారని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, వేల కిలోమీటర్ల నేషనల్ హైవేలను విస్తరించామన్నారు.
దేశవ్యాప్తంగా ఉజ్వల పథకంతో లక్షలాది గ్యాస్ కనెక్షన్లు మంజూరు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామన్నారు. పేదల కోసం ఐదేండ్లుగా ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నట్టు తెలిపారు. విద్యారంగ విస్తరణలో భాగంగా ములుగులో సమ్మక్కసారక్క గిరిజన యూనివర్సిటీ నెలకొల్పడం, రామప్ప దేవాలయానికి ప్రతిష్ఠాత్మక యునెస్కో గుర్తింపు సాధించిన ఘనత బీజేపీకే దక్కుతుందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేశామని తెలిపారు. ఈక్రమంలోనే 2040 నాటికి భారత దేశం ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. కుటుంబపాలన కాకుండా దేశం కోసం పాటుపడుతున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి మోదీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, నాయకులు ప్రేమేందర్‌రెడ్డి, గంట రవికుమార్, రాణిరుద్రమ, రాణాప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
సమయాన్ని వృథా చేయకండి
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి
మహబూబ్‌నగర్, మే 6 (విజయక్రాంతి): ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉందని, మిగిలిన సమయా న్ని వృథా చేయకుండా ఎలా సద్వినియోగం చేసుకుంటే మన అభ్యర్థి గెలు స్తారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు సాగాలని ఉత్తరా ఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి బీజేపీ శ్రేణులకు సూచించారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గ భూత్పూర్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి డీకే అరుణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తలపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.




