ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

06-10-2026 | 05:21pm

ఎస్ ఐ ఆర్ రద్దు, సీఈసీ రాజీనామా, బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలి: ఆత్రం సుగుణక్క

ఆసిఫాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ఎన్నికల వ్యవస్థలో (Electoral system)పారదర్శకత కోసం ఇండియా కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కుమురం భీం చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి, కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించకుండా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.

ఓటు హక్కును కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి లక్ష్యమన్నారు. ఓటు చోరీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై బిఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సీపీఎం నాయకులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, ఇరుకుల మంగ, బాలేష్ గౌడ్, రాపర్తి మురళి, ఇమ్రాన్, సద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు