10 July, 2026 | 4:36 PM

భారత్ జీడీపీ వృద్ధి 6.8 శాతం

07-05-2024 01:41 AM

 అంచనాల్ని పెంచిన ఐఎంఎఫ్

ముంబై, మే 6 : ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని పెంచింది. జనవరి నెలలో 6.5 శాతం వృద్ధి అంచనాల్ని ప్రకటించిన ఐఎంఎఫ్  తాజాగా మరో 30 బేసిస్ పాయింట్ల ను జతచేసింది. 2024 భారత్ జీడీపీ 6.8 శాతం వృద్ధిచెందుతుందని వెల్లడించింది. దేశీయంగా డిమాండ్ పరిస్థితు లు నెలకొనడం, పనిచేస్తున్న జనాభా పెరగడంతో భారత్ ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధిచెందుతుందన్నది. ఇదే సంవత్సరం చైనా వృద్ధి రేటు 4.6 శాతానికి పరిమితమవుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. 2025 భారత్ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని, 2025 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బ ణం 4.6%, 2026 ఆర్థిక సంవత్సరంలో 4.2 శాతంగా ఉంటుందం టూ ఆర్థిక సంస్థ వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో అంచనాల్ని ప్రకటించింది. 2023లో 5.6 శాతం ఉన్న ఆసియా వృద్ధి రేటు 2024లో 5.2 శాతానికి, 2025లో 4.9 శాతానికి తగ్గుతుందన్నది.